తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి - warangal district crime news

వరి పొలానికి నీరు పెట్టేందుకని వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Apr 10, 2021, 5:57 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గుంజల రాజిరెడ్డి అనే రైతు మృతి చెందాడు. రాజిరెడ్డి వరి పంటకు నీరు పెట్టేందుకని పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్​ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాజిరెడ్డి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పొలానికి వెళ్లారు. తమ వ్యవసాయ బావి సమీపంలోని రిజర్వాయర్ నీటిలో మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఫోన్​ కాజేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కాడు

ABOUT THE AUTHOR

...view details