మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీసలో ఓ రైతు పొలంలో విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 64 ఏళ్ల తుమ్మ సత్తిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం రోజులానే తాను సాగు చేస్తున్న వరి చేను దగ్గరకు వెళ్లారు. సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. మృతి చెంది ఉన్నారు. తెగిపడిన కరెంటు తీగ కాళ్లకు చుట్టుకుని ఉండడంతో విద్యుదాఘాతంతో చనిపోయినట్లు గుర్తించారు.
'నమ్ముకున్న పొలమే కాటేసిందానే.. అన్న' - mahabubabad district latest news
ఓ రైతు పొలంలో విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్లసంకీసలో చోటుచేసుకుంది.

'నమ్ముకున్న పొలమే కాటేసిందానే.. అన్న'
బావి దగ్గర పనిలో ఉన్నాడనుకున్న మనిషి అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు విలపించారు. పొలంలో అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు దామోదర్ ‘నమ్ముకున్న పొలమే నిన్ను కాటేసిందానే.. అన్న’ అంటూ కన్నీరుమున్నీరై సొమ్మసిల్లాడు. సత్తిరెడ్డికి భార్య, పిల్లలున్నారు.