రంగారెడ్డి జిల్లా షాబాద్ మండంలంలోని తాళ్లపల్లి గేట్ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘనటలో ఓ రైతు మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు దేవరంపల్లికి చెందిన బచ్చన్ గారి శేఖర్ రెడ్డిగా గుర్తించారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. రైతు మృతి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తాళ్లపల్లి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దేవరంపల్లికి చెందిన ఓ రైతు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'