తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు.

farmer died due to current shock in wana parthi district
విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Apr 13, 2021, 10:25 PM IST

Updated : Apr 13, 2021, 10:35 PM IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో జరిగింది. అమ్మపల్లి తండాకు చెందిన రెడ్యానాయక్ (46) ప్రతి రోజులాగే తన ఇంటికి సమీపంలో సాగుచేస్తున్న వరి పంటకు సాగునీరు అందించేందుకు వెళ్లాడు. బోరు మోటర్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. తనను కాపాడండంటూ పెద్ద కేకలు వేస్తూ... అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

అది విన్న భార్య, సభ్యులు వెంటనే మోటర్ వద్దకు చేరుకుని రెడ్యానాయక్​ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. భార్య బుజ్జమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. మృతుడికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:విషాదం: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

Last Updated : Apr 13, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details