ఏపీ కృష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు సూరపనేని వెంకట సుబ్బారావు... అనారోగ్యంతో శనివారం మరణించారు. సావిత్రి బాయి ఫూలే ఎడ్యుకేషనల్ & ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదేళ్ల క్రితమే శరీర దానానికి నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో అభ్యుదయ రైతు మరణం.. తెలంగాణ మెడికల్ కళాశాలకు మృతదేహం - అభ్యుదయ రైతు సుబ్బారావు మృతదేహం ఖమ్మం మమత ఆస్పత్రికి తరలింపు
ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు సూరపనేని వెంకట సుబ్బారావు అనారోగ్యంతో మరణించారు. ఆయన పదేళ్ల క్రితమే.. శరీర దానం చేయటానికి అంగీకారం చేశారు. కరోనాతో మరణించకపోయినా.. విజయవాడలో ఉన్న ఏ ఆస్పత్రి వారు మృతదేహాన్ని స్వీకరించలేదు. చివరకు రైతు కుమారుడు.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు.
రైతు మృతి, ఏపీలో రైతు మృతి, కృష్ణా జిల్లాలో రైతు మృతి
ఆయన కరోనాతో మరణించకపోయినా.. ఆస్పత్రి సిబ్బంది సర్టిఫికెట్ ఇచ్చినా.. విజయవాడలో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవీ అయన దేహదానాన్ని స్వీకరించలేదు. తండ్రి ఆశయాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పట్టుదలతో.. ఆయన కుమారుడు అనిల్.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం మమత మెడికల్ కళాశాలను సంప్రదించారు. వారు అంగీకరించిన మేరకు.. వెంకట సుబ్బారావు పార్థివ దేహాన్ని అప్పగించారు.