అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. చేతికొచ్చిన పంటను కొనుగోల కేంద్రాలకు తరలిస్తే వర్షార్పణం అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దైంది. నీటి పాలైన పంటను చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షానికి తడిసిన ధాన్యం.. పిడుగుపాటుకు పోయిన ప్రాణం - తెలంగాణ వార్తలు
అకాల వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు చేతికందవచ్చిన పంట నీటి పాలవుతోంది. మరోవైపు పిడుగుపాటు రైతులను పొట్టనపెట్టుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పిడుగు పాటుకు ఓ రైతు మృతి చెందారు.
పిడుగుపాటుతో రైతు మృతి
ఈ వర్షాల ధాటికి పిడుగు పడి బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు అనే వృద్ధుడు మృతి చెందారు. తన పొలం పనులు చేస్తుండగా వర్షం రావడంతో పక్కనే ఉన్న మామిడి చెట్టు కిందకి వెళ్లారు. చెట్టుపై పిడుగు పడి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి