విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి చెందారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కదిరెపాడు శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఓప్పితండాకు చెందిన చంద్రునాయక్‌కు వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కదిరెపాడు శివారులో మూడెకరాల పొలం ఉంది. బోరు మోటారు నుంచి నీటిని గుంతలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి పొలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్టర్ తీగ కాళ్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు.
విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి
వనపర్తి జిల్లా కదిరెపాడు శివారులో విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి చెందారు. పొలానికి నీరు పెడుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి, కరెంట్ షాక్తో రైతు మృతి
చంద్రునాయక్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయభాస్కర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృత్యువాత..