తెలంగాణ

telangana

ETV Bharat / crime

ధాన్యం కొనుగోలు చేయలేదని మనస్తాపంతో రైతు ఆత్మహత్య - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

నెలరోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెంది పొలంలోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

farmer commits suicide
మనస్తాపంతో రైతు ఆత్మహత్య

By

Published : May 22, 2021, 7:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డి గ్రామంలో నర్రి మల్లయ్య అనే రైతు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. ఈ సారి పత్తి పంట పైన నష్టం రాగా... మళ్లీ అప్పు చేసి వరి సాగు చేశాడు. వరి కోసి ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించాడు.

నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అప్పుల బాధ పెరిగింది. మనస్తాపానికి గురైన మల్లయ్య పొలంలోనే... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ సర్పంచ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: యాదాద్రి వెండిశిల్పఫలకాలపై ప్రహ్లాదచరితం

ABOUT THE AUTHOR

...view details