ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చిరామి గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని తన సమస్యను వివరిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి, కృష్ణయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. వీరిద్దరికి రెండేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈ దశలో కృష్ణయ్య పైకోర్టుకు వెళ్లాడు. కోర్టు వివాదంలో ఉన్న సమయంలో పోలీసులు తనను పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. బూతులు తిడుతున్నారని కృష్ణయ్య వాపోయాడు.