FARMER SUICIDE: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - రైతు ఆత్మహత్య
![FARMER SUICIDE: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య FARMER SUIISDE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13574985-120-13574985-1636365389544.jpg)
15:20 November 08
FARMER SUICIDE: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరి ధాన్యం కుప్ప వద్దే పురుగుల మందు తాగి రైతు బలవనర్మణానికి పాల్పడ్డాడు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌లో ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
ధాన్యం కుప్ప వద్ద కాపలాకు వెళ్లిన సింగం శంకర్(46) అనే రైతు అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు రైతు భార్య లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి గత కొంత కాలంగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పులయ్యామని ఆమె వాపోయారు. రెండు ఎకరాల పొలం అమ్మినా కూడా అప్పులు మాత్రం తీరకపోవడంతో జీవితంపై మీద విరక్తి చెంది ఆత్మ హత్య చేసుకున్నాడని మృతుని భార్య లక్ష్మీ తెలిపింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: