farmer suicide: ఒకవైపు పంట దిగుబడి రాకపోవడం.. మరోవైపు అప్పులు పెరిగిపోవడంతో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లాలోని సర్వాపురం గ్రామంలో జరిగింది.
farmer suicide: పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య - రైతు బలవన్మరణం
farmer suicide: అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భూమిని నమ్ముకుని సాగు చేసిన వరి సరైన దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
![farmer suicide: పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య Farmer commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13954697-376-13954697-1639940064394.jpg)
farmer suicide in mulugu district: ములుగు మండలం సర్వాపురం గ్రామానికి చెందిన గట్టు తిరుపతి అనే రైతు ఎకరన్నర పొలంలో వరి సాగు చేశాడు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం పొలంలో వేసిన వరి పంట ఏపుగా పెరగకపోవడంతో పాటు ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇప్పటికే 40 వేల రూపాయలు అప్పులు చేసి మరీ పంట పండించగా దిగుబడి రాకపోవడంతో పంట పొలం వద్దే క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆవేదనకు గురై తనువు చాలించాడని మృతుని భార్య గీత విలపించారు.
ఇదీ చూడండి: