Fan enthusiasm with GUN BULLETES: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కొప్పుల రవి అనే సింగరేణి కార్మికుడు శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ ఒకటో గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. రవి తన వాట్సాప్ స్టేటస్‌లో జై బాల్క సుమన్ అని బుల్లెట్లతో అమర్చిన పేర్లను స్టేటస్‌గా పెట్టుకున్నాడు.
బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం.. ఏకంగా బుల్లెట్లతోనే..! - బుల్లెట్లతో అభిమాని అత్యుత్సాహం
Fan enthusiasm with GUN BULLETES: బుల్లెట్లతో తన అభిమాన వ్యక్తి పేరు రాశాడు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. చివరికి అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు!

బాల్క సుమన్ అభిమాని
అది కాస్తా సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. అసలు అతనికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీశారు. చివరికి ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న తన స్నేహితుని వాట్సాప్ స్టేటస్ నుంచి కొప్పుల రవి స్టేటస్‌గా పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: