మెదక్ జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన అయ్యవారి శ్రీనివాస్(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లావణ్య(40), కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు కొన్నాళ్లుగా మహారాష్ట్ర దెగ్లూర్లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో గాని ఆదివారం రాత్రి శ్రీనివాస్.. భార్య లావణ్య, కూతురు కృతితో కలిసి బొల్లారం చెరువులో దూకారు.
చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు మృతి - తెలంగాణ వార్తలు
కూతురుతో సహా భార్యాభర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించగా, తండ్రి కూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని బొల్లారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కుటుంబం ఆత్మహత్య
స్థానికులు గమనించి చెరువులో నుంచి వారిని బయటకు తీశారు. కాగా అప్పటికే శ్రీనివాస్, కృతి చనిపోయారు, లావణ్య ప్రాణాలతో ఉండగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: former soldier firing: మాజీ సైనికుడి కాల్పులు.. ఇద్దరి మృతి