తెలంగాణ

telangana

ETV Bharat / crime

పిల్లలతో కలిసి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..! - family suicide attempt in Nizamabad

Family Suicide Attempt: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో భర్త మరణించగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

family suicide attempt in Nizamabad
family suicide attempt in Nizamabad

By

Published : Dec 15, 2022, 11:49 AM IST

Updated : Dec 15, 2022, 11:54 AM IST

Family Suicide Attempt: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన సాయిలు దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్‌, అరుణ్‌లతో కలిసి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులతో మృతుడు సాయిలు

గమనించిన స్థానికులు వీరిని నిజామాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందగా.. భార్య రేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Dec 15, 2022, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details