అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి - telanagana crime news
12:58 September 14
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి
family suicide attempt in Jagital district: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గత నెలలో అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగిన కుటుంబంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. తల్లి శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కుటుంబంలో తండ్రి కృష్టమూర్తి, కుమార్తె మృతి చెందగా ఈరోజు కుమారుడు అశ్రిన్ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి: