Family suicide attempt: హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు వేసి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పిల్లలు వాంతులు చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రూ. 2 కోట్ల వరకూ రావాల్సిన కాంట్రాక్ట్ బిల్లులు రాకుండా ఓ వ్యక్తి అడ్డుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మంకు చెందిన దంపతులు శశికుమార్, శ్వేత తమ ఇద్దరు పిల్లలతో సహా హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని లాడ్జిలో దిగారు. అనంతరం పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి.. భార్య శ్వేతతో పాటు తానూ తీసుకున్నారు. అంతకుముందుగా సెల్పీ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సూసైడ్ లెటర్‌తో పాటు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లులు రావడంలేదని... ఆ డబ్బులు ఇవ్వకుండా దినేష్ రెడ్డి అనే కాంట్రాక్టర్ వేధింపులకు గురిచేయడంతోపాటు... ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవవ్వడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో తెలిపారు.
"నేను జేవీఎఫ్ ప్రతాప్ రెడ్డి కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు రావాల్సిన బిల్లులు రాకుండా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. మా చనిపోవడానికి కారణం దినేష్ రెడ్డి. రూ. 2 కోట్ల వరకూ రావాల్సి ఉంది. మాకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా మా మీద దొంగతనం కేసు మోపారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక మా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం." -శశి కుమార్, బాధితుడు