Family suicide attempt at collectorate: భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు కుటుంబం.. కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ఆచన్పల్లి గ్రామానికి చెందిన రాణి, మల్లీశ్వరి.. వాళ్ల మామయ్య లింగయ్యతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బలవన్మరణానికి యత్నించారు.
భూమి కబ్జా చేశారని.. కలెక్టరేట్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం - తెలంగాణ నేర వార్తలు
12:01 January 17
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం
1992లో ఆచన్పల్లి మాజీ సర్పంచ్ సాయిలు కుటుంబీకుల వద్ద మా నాన్న నర్సయ్య రెండెకరాల పొలం కొన్నారు. అప్పటి నుంచి అందులో మేము పంట పండిస్తున్నాం. కొన్నేళ్లకు మా నాన్న చనిపోయారు. ఇప్పుడేమో వాళ్లు వచ్చి మేం పొలం అమ్మలేదు అంటున్నారు. మా మీద దాడి చేసి చంపేయాలని చూస్తున్నారు. పోలీసులకు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు న్యాయం చేయండి. --- మల్లీశ్వరి, రైతు నర్సయ్య కుమార్తె
ఆచన్పల్లి మాజీ సర్పంచ్ సాయిలు.. తమ రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ మల్లీశ్వరి ఆరోపించారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. దీంతో వాళ్ల మామయ్య లింగయ్యతో కలిసి ఇద్దరు అక్కాచెల్లెలు పెట్రోలు పోసుకోగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు సీసాను లాక్కున్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని.. న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
ఇదీ చదవండి:Cyber Crimes: మీకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా... అయితే ఓ లుక్కేయండి