సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆర్థిక సమస్యలతో ఇద్దరు కుమార్తెలు సహా దంపతులు పురుగుల మందు తాగారు. ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మరణించగా.. తండ్రి, చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.
SUICIDE ATTEMPT: ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం - bowenpally Family suicide attempt news
21:26 July 01
SUICIDE ATTEMPT: ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
రాజస్థాన్ నోహర్కు చెందిన విజయ్, స్నేహా భాటియాలు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. విజయ్ ఓ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో తల్లి, 15 ఏళ్ల పెద్ద కుమార్తె హన్సిక మరణించగా.. భర్త, చిన్న కుమార్తె వన్షిక పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న తండ్రి విజయ్, చిన్న కుమార్తె వన్షికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడానికి గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: Drugs: హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్