తెలంగాణ

telangana

ETV Bharat / crime

isnapur family electrocuted incident : ఇస్నాపూర్ విద్యుదాఘాతం ఘటనలో మరొకరు మృతి - తెలంగాణ వార్తలు

isnapur family electrocuted incident : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మృత్యువాత పడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

isnapur family electrocuted incident, isnapur current shock incident
ఇస్నాపూర్ విద్యుదాఘాతం ఘటనలో మరొకరు మృతి

By

Published : Dec 28, 2021, 9:51 AM IST

Isnapur family electrocuted incident : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ విద్యుత్ ప్రమాదంలో రేణు మాలిక్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇప్పటికే ఆమె భర్త బసుదేవ్ మాలిక్‌, చిన్న కూతురు మృతి చెందారు. విద్యుదాఘాతం ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

సోమవారం రాత్రి మృతి చెందిన రేణు మాలిక్

ఏం జరిగింది?

Isnapur electric shock: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని ప్రముఖ్ నగర్​లో నివాసం ఉంటున్న బసుదేవ్ మాలిక్... పక్కగది తలుపు తీసేందుకు కిటికీ నుంచి ఇనుప చువ్వతో ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనుక ఉన్న 11కేవీ విద్యుత్ తీగ గమనించలేదు. అతని చేతిలో ఉన్న ఇనుప చువ్వ విద్యుత్ తీగకు తగిలి... బసుదేవ్ మాలిక్, ఆయన చిన్న కుమార్తె కున్ను మల్లిక్​లు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బసుదేవ్ భార్య రేణు మాలిక్... చందానగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ విద్యుదాఘాతం ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.

ఇస్నాపూర్ విద్యుదాఘాతం ఘటనలో మరొకరు మృతి

తీరని శోకం

ప్రమాద సమయంలో వారి పెద్ద కూతురు పాఠశాలకు వెళ్లడంతో ఆ చిన్నారి క్షేమంగా ఉంది. ప్రస్తుతం బంధువుల దగ్గర ఆ పాప ఉంది. విద్యుత్ తీగలు ఇళ్లకు దగ్గరగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందని వాపోయారు. వీరంతా ఒడిశాలోని జాజిపూర్ మండలం జగాత్​ సింగ్​పూర్​కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అక్కడికక్కడే మృతి చెందిన మాలిక్, చిన్నారి

ఇనుప చువ్వతో ప్రాణాలమీదకు..

ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవమాలిక్‌ కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం ఇస్నాపూర్​లోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ తన కుటుంబంతో కలిసి ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో నివాసముంటున్నాడు. ప్రమాదంలో బసుదేవమాలిక్‌, అతని కాళ్లవద్ద ఉన్న రెండేళ్ల చిన్నకూతురు కున్నుమాలిక్‌ కూడా అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో భార్య రేను మాలిక్‌ తీవ్రంగా గాయపడటంతో ఆమెను చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Himayat Sagar Accident: లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details