తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమార్తె గర్భిణీ అని చూడకుండా కిడ్నాప్ చేసిన కుటుంబసభ్యులు.. కారణం అదేనా.! - కులాంతర పెళ్లి చేసుకుందని కుమార్తె కిడ్నాప్

Family members kidnapped daughter: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని యువతి తరఫు బంధువులు అత్తవారింటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. కన్నకూతురు మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కర్కశంగా ద్విచక్రవాహనంపై బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

kidnapped daughter
kidnapped daughter

By

Published : Oct 3, 2022, 8:22 PM IST

Updated : Oct 3, 2022, 8:52 PM IST

Family members kidnapped daughter: నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రంలో తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని.. నచ్చక ఆమె అత్తవారింటికి వెళ్లి దౌర్జన్యంగా అత్తమామలను బెదిరించి, వారిపై దాడి చేసి కుమార్తెను తీసుకెళ్లారు. అమ్మాయి గర్భిణీ అని చూడకుండా యువతి కుటుంబ సభ్యులు బైక్​పై బలవంతంగా ఎక్కించుకుని ఎత్తుకెళ్లారు. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను ఎత్తుకెళ్లారని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలలోకి వెళ్తే.. ఎరుగట్ల మండల కేంద్రానికి చెందిన మాసం వంశీకృష్ణ అదే గ్రామానికి చెందిన శ్రీజ అనే అమ్మాయి గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఆరునెలల క్రితం పెద్దలను ఎదురించి ఆర్య సమాజ్​లో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం యువతి తరఫు వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు.

అప్పుడు పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని అత్తారింటికి పంపారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో రెండు నెలల అనంతరం యువతి తరఫు బంధువులు అమ్మాయిని పలుమార్లు కిడ్నాప్ చేయడానికి రెక్కీ నిర్వహించారు. అలాగే ఆమె భర్తను సుపారి ఇచ్చి మరీ చంపడానికి యువతి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. ఇదే విషయమై యువతి భర్త వంశీ తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు మరోసారి యువతి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు.

నిన్న సాయంత్రం భర్త వంశీ ఇంట్లో లేని సమయంలో యువతి తరఫు బంధువులు వచ్చారు. అత్తారింటికి వచ్చి వారిపై దాడి చేసి యువతిని తీసుకెళ్లారు. కూతురు మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ద్విచక్రవాహనంపై బలవంతంగా ఎక్కించుకుని ఎత్తుకెళ్లారని భర్త వంశీ తెలిపాడు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకుల అండదండలు యువతి తరఫు బంధువులకు ఉండటంతో కేసును పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయాడు. తనకు తన భార్యను అప్పగించి న్యాయం చేయాలని భర్త వంశీ పోలీసులను కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 3, 2022, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details