ఉరివేసుకుని కుటుంబం ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా! - suicide
13:15 February 07
Choppadandi Family Suicide: కుమార్తె వివాహంతో ఎక్కువైన అప్పులు
Choppadandi Family Suicide: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని దంపతులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతులు బైరి శంకరయ్య(55), జమున(50), శ్రీధర్(25)లుగా గుర్తించారు. మూడు నెలల క్రితం శంకరయ్య కుమార్తె వివాహం చేశారు. దీనితో అప్పులు పెరిగాయి. ఎలా తీర్చాలో తెలియక.. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంటి బయట తాళం వేసి.. మరో ద్వారం గుండా లోనికి ప్రవేశించి ముగ్గురు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:ఆలియా-రణ్బీర్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడు-ఎక్కడంటే?