Family Commits Suicide: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ గౌడ్, అల్వాల్‌లోని బ్రాహ్మణ కులానికి చెందిన అనామికలు గత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కూతురు స్నిగ్ధ కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా... అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్ గ్లోబల్ కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారం.. ఏమైందో తెలియదు గానీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా ఫోన్ లేపడం లేదు.
బోర్లించి ఉన్న దేవుని పటాలు... కూతురితో పాటు దంపతుల మృతదేహాలు.. అమీన్పూర్లో మిస్టరీ డెత్ - తెలంగాణ క్రైమ్ వార్తలు
14:02 January 20
Family Commits Suicide: అమీన్‌పూర్ పరిధిలోని వందనపురి కాలనీలో ఘటన
దీంతో అనుమానం వచ్చి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఉంటున్న శ్రీకాంత్ గౌడ్ నివాసానికి వచ్చి చూశాడు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు తలుపు తెరిచి చూసేసరికి అవాక్కయ్యారు. ఏడేళ్ల స్నిగ్ధ, ఆమె తల్లి అనామిక నురగలు కక్కుతూ విగతజీవిలుగా పడి ఉన్నారు. పక్క గదిలో బాలిక తండ్రి శ్రీకాంత్ గౌడ్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వారి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండడం, దేవుని గదిలో దేవుని చిత్రపటాలు బోర్లించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ కుటుంబం కనిపించడం లేదని సమాచారం రాగా.. వెంటనే అక్కడికి వెళ్లాం. ఆ ఇంటికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. అనుమానంతో తలుపులు తెరిచి చూడగా.. ఓ బెడ్రూంలో శ్రీకాంత్‌గౌడ్ ఉరేసుకుని ఉన్నాడు. మరొక గదిలో చిన్నారి స్నిగ్ధతో పాటు ఆమె తల్లి చనిపోయి ఉన్నారు. వారిద్దరు విషం తీసుకుని చనిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -శ్రీనివాసులు రెడ్డి, అమీన్పూర్ సీఐ
ఇదీ చూడండి:భర్తపై కోపంతో పసికందును చంపి.. భార్య ఆత్మహత్యాయత్నం