Family suicide attempt: ప్రగతి భవన్ ముందు కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇవాళ అధికారుల ముందు తన గోడును వెల్లబుచ్చుకునేందుకు ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేశ్ అనే వ్యక్తి వినతి పత్రం తీసుకొని తన కుటుంబంతో సహా ప్రగతి భవన్‌కు వచ్చాడు. అంతలోనే తనతో తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న భద్రత సిబ్బంది వెంటనే గమనించి అతని చేతిలోని కిరోసిన్ బాటిల్‌ను లాక్కున్నారు.
ప్రగతి భవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..! - Family suicide attempt
Family suicide attempt: ఎప్పుడు పోలీసులు, అధికారులతో బిజీబీజీగా ఉండే ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇంతకి అతను ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చింది.. ఎక్కడి నుంచి ప్రగతి భవన్‌కు వచ్చారంటే..!
![ప్రగతి భవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..! Family attempted suicide at Pragati Bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17619724-829-17619724-1675070971835.jpg)
Family attempted suicide at Pragati Bhavan
బాధితుడు ఐలేశ్ తెలిపిన వివరాలు ప్రకారం 2010 సంవత్సరంలో తన భూమిని ప్రభుత్వం తీసుకొని ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదని ఆరోపణలు చేశారు. తక్షణమే తన కుటుంబానికి పరిహరం ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నతిపత్రం ఇచ్చేందుకు కుటుంబంతో ప్రగతి భవన్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: