Fake message: ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడి పేరుతో.. బెంగళూరులోని మణిపాల్ వైద్యశాల ఎండీకి నకిలీ మెసేజ్ చేశాడో గుర్తు తెలియని వ్యక్తి. రుక్కీ భాయ్ అనే క్రికెటర్‌కు.. పది లక్షల రూపాయల విలువైన క్రికెట్ కిట్లు స్పాన్సర్ చేయాలని.. దానిపై మణిపాల్ చిహ్నాన్ని ముద్రిస్తామని.. వాట్సాప్ ద్వారా మణిపాల్ ఆసుపత్రి ఎండీకి మెసేజ్ పంపారు.
'హలో.. నేను ముఖ్యమంత్రి పీఏను మాట్లాడుతున్నా.. ఆ పని చేయండి' - సీఎం వ్యక్తిగత సహాయకుడి పేరుతో నకిలీ సందేశం
Fake message: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడి పేరుతో.. గుర్తుతెలియని వ్యక్తి బెంగళూరులోని మణిపాల్ వైద్యశాల ఎండీకి వాట్సాప్‌లో చేశారు. ఈ నకిలీ మెసేజ్ ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
'హలో.. నేను ముఖ్యమంత్రి పీఏను మాట్లాడుతున్నా.. ఆ పని చేయండి'
దీంతో.. ఆ సందేశాన్ని తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాల అసోసియేట్ డైరెక్టర్‌కు పంపించి.. అది నిజంగా సీఎం పీఏ నుంచే వచ్చిందా? అని విచారించారు. ఈ విచారణలో ఆ మెసేజ్ నకిలీదని, గుర్తు తెలియని వ్యక్తి పంపాడని తేల్చారు. ఈ తప్పుడు సందేశం పంపింది పాత నేరస్థుడేనని భావిస్తున్న పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి: