తెలంగాణ

telangana

ETV Bharat / crime

కలెక్టర్‌ డీపీతో డబ్బుల ఎర.. మోసపోయిన వైద్యుడు - Adilabad collector sikta patnaik fake whatsapp

Adilabad Collector : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో నకిలీ వాట్సాప్‌ వినియోగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వాట్సాప్ ద్వారా గిఫ్ట్ ఓచర్లు పోస్ట్ చేస్తూ అధికారులకు, ప్రముఖులకు వాట్సాప్ సందేశాలు పంపారు. కలెక్టర్ ఫొటోతో ఉన్న నంబర్ నుంచి మెసేజ్ రావడం వల్ల ఓ వైద్యుడు రూ.లక్ష విలువైన గిఫ్ట్ కూపన్లను ఆన్‌లైన్‌ కొని ఆ నంబర్‌కు పంపారు. నకిలీ వాట్సాప్ ఖాతాపై కలెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Adilabad Collector Sikta Patnaik
Adilabad Collector Sikta Patnaik

By

Published : Apr 22, 2022, 8:36 AM IST

Adilabad Collector : సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరిట 7234822110 నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి.. అత్యవసర సమావేశంలో ఉన్న డబ్బులు పంపాలని జిల్లా అధికారులకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. అలా సందేశాలు వచ్చిన సమయంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో.. ఈ విషయాన్ని ఓ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అప్రమత్తమైన కలెక్టర్ వెంటనే తన పేషీ సిబ్బంది చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

కలెక్టర్‌ డీపీతో డబ్బుల ఎర

Adilabad Collector Sikta Patnaik :ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ కొందరికి మొబైల్‌ నంబరు 72348 22110 నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. ‘అత్యవసర సమావేశంలో ఉన్నా. ఫోన్‌ చేయలేకపోతున్నా. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు’ అన్నది వాటి సారాంశం. డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌) చూస్తే కలెక్టర్‌ ఫొటో ఉంది. ఆశ్చర్యపోయిన వారు వెంటనే ఎదురుగానే ఉన్న సిక్తా పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆమె తన పేషీ ద్వారా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇదే క్రమంలో ఒక ప్రభుత్వ వైద్యుడు మోసపోయారు. కలెక్టర్‌ డీపీ ఉన్న మొబైల్‌ నంబరు నుంచి డబ్బులు పంపాలని వాట్సప్‌ మెసేజ్‌లు రాగానే ఆదిలాబాద్‌కు చెందిన ఆయన స్పందించారు. తన బావమరిదికి డబ్బులు పంపితే ఆయన రూ.10 వేల విలువైన పది అమెజాన్‌ కూపన్లు కొని అవతలివ్యక్తికి పంపారు. ఆ తర్వాత మరో రూ.1.5 లక్షలు కావాలని అడగడంతో అనుమానం వచ్చి ఆ వైద్యుడు కలెక్టర్‌ పేషీని సంప్రదిస్తే విషయం అర్థమైంది. వెంటనే ఆ కూపన్లను క్యాన్సిల్‌ చేస్తూ వెళ్లగా అప్పటికే ఆ వ్యక్తి మూడు కూపన్లను వాడేశాడు. తక్కిన ఏడు కూపన్లకు సంబంధించిన రూ.70 వేలను వెనక్కు రాబట్టుకోగలిగారు.

కలెక్టర్‌ డీపీతో డబ్బుల ఎర

ABOUT THE AUTHOR

...view details