తెలంగాణ

telangana

ETV Bharat / crime

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు' - ఆదిలాబాద్​ నేర వార్తలు

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఉట్నూరు డీఎస్పీ ఉదయ రెడ్డి హెచ్చరించారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Telangana news
ఆదిలాబాద్​ వార్తలు

By

Published : Jun 8, 2021, 1:36 PM IST

నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని ఉట్నూరు డీఎస్పీ ఉదయ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. మండలంలోని గాదిగూడ సమీపంలో ద్విచక్రవాహనంపై నకిలీ విత్తనాలు తీసుకెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి యాబై విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సీజన్​లో ఇదే మొదటి కేసని... ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Fake seeds: గద్వాల జిల్లాలో నకిలీ విత్తన దందాపై కొరడా

ABOUT THE AUTHOR

...view details