నకిలీ విత్తనాల మాఫియాపై నారాయణపేట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నారాయణ పేట పట్టణ కేంద్రంలో అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 64 కేజీల లూజ్ నకిలీ పత్తి విత్తనాలు, 110 పాకెట్ల పల్లవి సీడ్స్ నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాటి విలువ సుమారు రూ.1,98,500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మరో వ్యక్తి ఇంట్లో కూడా 13 కేజీల లూజ్ పత్తి విత్తనాలు లభించాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు 26 వేల రూపాయలు ఉంటుందని అన్నారు. పంచనామా అనంతరం ఎస్ఐ సైదయ్య, ఏఓ నాగరాజు… వెంకటేశ్వర్లు, హరిబాబులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
fake seeds: అధికారుల దాడులు.. భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం - narayanpet crime news
నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నారాయణపేటలో దాడులు నిర్వహించి పలువురి నుంచి భారీగా విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో 64 కిలోలు, 110 ప్యాకెట్ల పల్లవి సీడ్స్, మరోకరి ఇంట్లో 13 కేజీల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే… కంప్లైంట్ నెంబర్ 79014 00100కి వాట్సాప్ మెసేజ్ చేయాలని లేదా డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ చేతన ఈ సందర్భంగా వెల్లడించారు.
fake seeds: అధికారుల దాడులు.. భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మినా, తయారు చేసినా, సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నకిలీ విత్తనాల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే… కంప్లైంట్ నెంబర్ 79014 00100కి వాట్సాప్ మెసేజ్ చేయాలని లేదా డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ చేతన సూచించారు.
ఇదీ చూడండి:Fire Accident: ప్లైవుడ్ పరిశ్రమలో మంటలు.. భారీగా ఆస్తి నష్టం