Fake Facebook Account : ఆ బూచోళ్లు చివరికి సీఎం సీపీఆర్వోనూ వదల్లేదుగా? - fake fb account cases
10:00 October 02
Fake Facebook Account : సీఎం సీపీఆర్వో పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా
సైబర్ నేరగాళ్ల(Cyber crimes) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు నయా పంథాల్లో ప్రయత్నిస్తుంటే.. తప్పించుకోవడానికి కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. ఈ కేటుగాళ్ల అరాచకాలతో ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఈ సైబర్ నేరాల(Cyber crimes)లో తాజాగా నకిలీ ఫేస్‌బుక్ ఖాతాల(Fake Facebook Account) ట్రెండ్ నడుస్తోంది. ఫేక్ ప్రొఫెల్ క్రియేట్ చేసి రకరకాల మోసాల(Cyber crimes)కు పాల్పడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా(Fake Facebook Account) ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఖాతా(Fake Facebook Account)తో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు డిమాండ్ చేశారు. సీఎం సీపీఆర్వో జ్వాల నర్సింహరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరైనా తమకు ఫేస్‌బుక్(Fake Facebook Account)లో చాట్ చేస్తూ డబ్బులు అడిగితే.. వారి వలలో పడకూడదని పోలీసులు అన్నారు. ఒకవేళ తెలిసిన వారే అడిగితే డైరెక్ట్‌గా వాళ్లకు ఫోన్ చేసి విషయం తెలుసుకుని అప్పుడే నగదు ఇవ్వండని చెబుతున్నారు. తెలియని వాళ్లు, కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్లు డబ్బడిగితే అది అనుమానించాల్సిన విషయమని.. వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.