రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేరిట సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్ నకిలీ ఖాతా తెరిచారు. ఫేస్‌బుక్ మెసేంజర్ నుంచి మంత్రి పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. డబ్బు అత్యవసరం ఉందని వెంటనే గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పంపాలని అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల్లో గమనించిన తెరాస నేతలు పోలీసులకు సమాచారం అందించారు. నకిలీ ఖాతాపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సైబర్ వల.. మంత్రి జగదీశ్ రెడ్డి పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ - Fake Facebook account in the name of Minister Jagadish Reddy
రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో అమాయకుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధుల పేర్లను సైతం వాడుకుంటున్నారు. తాజాగా మంత్రి జగదీశ్‌రెడ్డి పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి పలువురి నుంచి డబ్బు వసూళ్లకు యత్నించారు.

మంత్రి జగదీశ్ రెడ్డి పేరిట నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్