హైదరాబాద్ మాదాపూర్ ఎస్‌హెచ్‌వో పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఆయన పేరుతో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు. ఆయన స్నేహితులు కొంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించగా.. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా చాట్ చేసి వాట్సాప్ నెంబర్లు సేకరించారు. ఆపై వాట్సాప్ ద్వారా చాట్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారు.
FAKE ACCOUNT: మాదాపూర్ ఎస్‌హెచ్‌వో పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా - telangana latest news
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని విజృంభిస్తున్నారు. గతంలో పలువురు రాజకీయ నాయకుల నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించిన కేటుగాళ్లు.. ప్రస్తుతం పోలీస్ అధికారుల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా మాదాపూర్ ఎస్‌హెచ్‌వో పేరిత నకిలీ ఖాతాను సృష్టించారు.
మాదాపూర్ ఎస్‌హెచ్‌వో పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా
నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారని గుర్తించిన ఎస్‌హెచ్‌వో.. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.