హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ బండ శివప్రసాద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్ సృష్టించారు. పలువురు ప్రముఖులకు ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసెజ్‌లు పంపారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏజీ ఫిర్యాదు చేశారు. అకౌంట్‌ను తొలగించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏజీ బండ శివప్రసాద్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా - cyber fraud latest news
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. ఏదో ఒక కారణం చెప్పి నగదు కావాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. తాజాగా ఏజీ బండ శివప్రసాద్ పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి, పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారు.
ఏజీ బండ శివప్రసాద్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా
మరో కేసులో మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా కొందరు పోస్టింగులు పెడుతున్నారని.. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఇర్ఫాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Kishan reddy: 'న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు'