తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2021, 11:22 PM IST

ETV Bharat / crime

రూ.7.9 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని సుంకి ఘాట్ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 7.9 కోట్ల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరాపుట్ జిల్లా ఎస్పీ గుంటుపల్లి వరుణ్ వెల్లడించారు.

విశాఖకు తరలిస్తున్న రూ.7.9 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత
రూ.7.9 కోట్ల నకిలీ కరెన్సీ పట్టివేత

ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వాహనాల తనిఖీ సమయంలో వీటిని గుర్తించామని కోరాపుట్‌ ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు.

నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందన్నారు. రూ.500 నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:మూడేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసిన పిన్ని

ABOUT THE AUTHOR

...view details