తెలంగాణ

telangana

ETV Bharat / crime

Blast in Hyderabad: గుంత తీసి.. ఒకేసారి ఐదు బాంబులు పెట్టారు..! - దీవాళి రోజు విషాదం

దీపావళి పండుగ రోజున కందికల్​ గేట్​లో విషాదం చోటుచేసుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలో బాణాసంచా కాల్చటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా.. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Blast in Hyderabad
పేలుడు ఘటనలో ఇద్దరు మృతి

By

Published : Nov 5, 2021, 12:37 PM IST

చత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కందిగేట్ సమీపంలో అర్ధరాత్రి జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పీఓపీతో విగ్రహాలు తయారు చేసే గోదాంలో పేలుడు సంభవించిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

దీపావళి పండుగ నేపథ్యంలో విష్ణు​(25), జగన్​(30) గురువారం అర్ధరాత్రి సమయంలో టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఫీట్ గుంత తీసి అందులో ఒకేసారి ఐదు బాంబులు పెట్టారు. ఈ క్రమంలో పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు ధాటికి విష్ణు, జగన్​లు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనలో వీరేందర్​కు తీవ్రగాయాలయ్యాయి.

రసాయనాలు కలిశాయా..?

సమాచారం అందుకున్న క్లూస్‌ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. పేలుడుకు బాణాసంచానే కారణమా లేకపోతే...? ఏమైనా రసాయనాలు కలిశాయా..? అనే కోణంలో వివరాలు సేకరించారు. విగ్రహాలు తయారు చేసేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఉపయోగిస్తున్నారు. అక్కడ విగ్రహాలు తయారు చేసే క్రమంలో ఇంకేమైనా రసాయనాలు ఉపయోగిస్తున్నారా..? అనే వివరాలు సేకరిస్తున్నారు. మృతులు పశ్చిమ బంగకు చెందిన వారిగా గుర్తించారు. వీళ్లు కొంత కాలంగా అకల్ఫ్ ముఖీమ్ అనే గుత్తేదారు వద్ద పని చేస్తున్నారు.

టపాసులు కాల్చే క్రమంలో బాణాసంచాకు ఏమైనా రసాయనాలు కలిశాయా..? అనే కోణంలో క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో సేకరించిన మట్టి, బాణాసంచాను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదిక వస్తే పేలుడికి గల కారణాలు పూర్తిగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:Blast in Hyderabad: హైదరాబాద్​లో పేలుడు.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details