తెలంగాణ

telangana

ETV Bharat / crime

Extramarital Affair: వివాహేతర సంబంధం తీసింది ఇద్దరి ప్రాణం - మెదక్ జిల్లా తాజా నేర వార్తలు

Extramarital Affair: ఒక వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగకుండా అతను ఆమె కూతురితో సంబంధం కొనసాగిస్తున్నాడు. తల్లీకూతుళ్లు అతడిని డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఎలాగైనా వారిని అడ్డు తొలగించుకోవాలని ఆ వ్యక్తి ప్లాన్ వేశాడు. చివరికి ఏమైదంటే..

SP Rohini Priyadarshini
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

By

Published : Apr 17, 2022, 4:37 PM IST

Extramarital Affair: మెదక్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మ ఆమె కూతురు సంతోష ఏప్రిల్ 10న చేగుంటకు షాపింగ్​కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏప్రిల్ 15న వడియారం అటవీ ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరపగా మృతులు యాదమ్మ ,సంతోషగా గుర్తించారు. నిందితుడుని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టగా వడియారం గ్రామానికి చెందిన మరికింది నగేశ్​పై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకొని విచారించంగా తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

నగేశ్​కు గతంలో తల్లీ కూతుళ్లతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వారు నిందితుడి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే అతనిపై కేసు పెడతామని బెదిరించారు. దీంతో నగేశ్ ఎలాగైనా వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి వడియారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగారు. ఆ మత్తులోనే నగేశ్​ తల్లికూతుళ్లను గొంతు నులిమి హత్యచేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలియచేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:వలపు వల.. చిక్కితే గిలగిల!.. అతిథుల ముసుగులో కిలేడీల బాగోతం

పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే..

ABOUT THE AUTHOR

...view details