మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి శివారులోని ఓ గ్రానైట్ క్వారీ సమీపంలోని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. వీటిని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ దేవత పండుగ జరుపుకునేందుకు భూమిని చదును చేస్తుండగా ముళ్లపొదల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు. గ్రామస్థులంతా భయాందోళనలకు గురవుతున్నారు.
క్వారీ సమీపంలో పేలుడు పదార్థాలు - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా కాట్రపల్లి శివారులోని క్వారీ సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ఊరిలో పండుగ కోసం భూమి చదునుచేస్తుండగా పేలుడు పదార్థాలను గుర్తించారు. స్థానికంగా ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు పదార్థాలు, కాట్రపల్లిలో పేలుడు పదార్థాల గుర్తింపు
గ్రామస్థుల సమాచారంతో సమాచారంతో కేసముద్రం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా నిర్వహించిన తనిఖీల్లో 85 జిలెటిన్ స్టిక్స్, 22 భూస్టర్స్, 4 సేఫ్టీ డిటోనేటర్స్, 8 డిటోనేటర్స్, వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఏ క్వారీకి సంబంధించినవి అనే కోణంలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా వేళ పుట్టినరోజు వేడుకలు.. రౌడీ షీటర్‌పై కేసు నమోదు