తెలంగాణ

telangana

ETV Bharat / crime

Explosive material: కొరియర్‌లో పేలుడు పదార్థాల కలకలం.. ఎక్కడంటే?? - నవత ట్రాన్స్​పోర్ట్​లో పార్సిల్ కలకలం

Explosive material: హైదరాబాద్​లో ఓ పార్సిల్ కలకలం రేపింది. వనస్థలిపురం పరిధిలోని నవతా ట్రాన్స్​పోర్ట్ కొరియర్​లో పేలుడు పదార్థాలు ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Explosive material
నవతా ట్రాన్స్​పోర్ట్ కొరియర్​లో పేలుడు పదార్థాలు

By

Published : Mar 17, 2022, 8:32 PM IST

Explosive material: హైదరాబాద్​లోని నవతా ట్రాన్స్‌పోర్టు కొరియర్‌లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలిపురం ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఓ పార్సిల్​లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రాన్స్‌పోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించగా ఈ విషయం బయటపడింది.

ఈ నెల 14న చిలకలూరిపేట నుంచి పుణెకు 8 కార్టన్ల పార్సిల్​ను విశాల్ అనే వ్యక్తి బుకింగ్ చేసినట్లు ట్రాన్స్​పోర్ట్ సిబ్బంది తెలిపారు. ఈనెల 15న హైదరాబాద్‌లోని నవతా ట్రాన్స్​పోర్ట్​కు పార్సిల్ చేరుకున్నట్లు వెల్లడించారు. అనుమానంతో 8 కార్టన్లను దూరంగా తీసుకెళ్లిన ట్రాన్స్‌పోర్టు సిబ్బంది అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిపై ఆరా తీశారు. అయితే అవి సినిమాల్లో వాడే బాంబులుగా పోలీసులు తేల్చారు. పార్సిల్​లో 135 కిలోల బరువున్న 100 బాంబులు ఉండగా.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details