తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డు మీద అడిగిన వారికి ఫోన్​ ఇస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే..!

CYBER FRAUDS : ఎవరైనా అపరిచిత వ్యక్తి అత్యవసర కాల్ చేసుకోవాలని అడిగితే పెద్ద మనసుతో వారికి మన సెల్‌ఫోన్‌ ఇస్తుంటాం. ఇకపై ఇలా ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. మన ఫోన్‌ నుంచి యూనిక్‌ కోడ్‌ ద్వారా వేరే నెంబర్‌కు కాల్ చేసి మన ఫోన్‌ను హ్యాక్‌ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Latest cyber crime
సరికొత్తగా సైబర్​ నేరాలు

By

Published : Dec 23, 2022, 2:57 PM IST

CYBER FRAUDS : సాంకేతికత పెరుగుతున్న కొద్దీ.. సైబర్‌ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. జాగ్రత్తలు తీసుకున్నా.. అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో ప్రజలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. వివిధరకాల మోసాలతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లలో వచ్చే ప్రకటనల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపరిచితులకు ఫోన్‌ ఇచ్చే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పండుగల సీజన్ అయిన డిసెంబర్‌, జనవరి నెలల్లో సైబర్ నేరాలు ఎక్కువగా జరిగే అవకాశముందని చెబుతున్నారు.

"మీరు రోడ్డుమీద వెళ్తున్నప్పుడు చాలా మంది నా ఫోన్​ మర్చిపోయాను.. ఒకసారి మీ ఫోన్​ ఇస్తారా అని అడుగుతారు. ఒకవేళ మీరు ఫోన్​ ఇస్తే.. వేరే వారికి ఫోన్​ చేస్తున్నట్లు చేసి మీ కాల్స్​, ఓటీపీలు వాళ్లకి ఫార్వర్డ్​ చేసుకుంటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో మీ సోషల్​ మీడియా అకౌంట్లు అన్ని హ్యాక్​ అవుతాయి. మీ ఫోన్​ తీసుకున్న తర్వాత *402* అటాకర్​ నెంబర్​ ఎంటర్ చేస్తారు. దాని వల్ల మీ సెక్యూరిటీ ఓటీపీలు, ఫోన్​కాల్స్​ అన్ని వాళ్లకి ఫార్వర్డ్​ అవుతాయి."-భరత్ కుమార్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు

క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా లక్కీడ్రా పేరుతో SMS లేదా ఈ-మెయిల్ పంపితే.. అందులో లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా మన ఫోన్‌ను హ్యాక్‌ చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ పేరుతోనో, ఇతర సర్వీసుల పేర్లు చెప్పో వచ్చే ఫోన్‌ కాల్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

"సర్వీస్​ ప్రొవైడర్​లా కాల్​ చేసి మీ ఫోన్​లో ఫలానా సర్వీసు యాక్టివేట్​లో ఉంది.. దానిని డీ యాక్టివేట్​ చేయాలంటే మేము చెప్పినట్లు చేయమని చెప్తారు. దానికి మీరు ఓకే అని చెపితే మిమ్మల్ని 15 నిమిషాలు సమయం అడిగి.. ఆ సమయంలో మీ సర్వీసులు డీయాక్టివేట్​ అవుతాయని చెప్పి నమ్మిస్తారు. ఆ సమయంలో మీ కాల్స్​, సోషల్​ మీడియా అకౌంట్స్​, ఓటీపీలు అన్ని వాళ్లకి పంపించుకుంటారు"-భరత్ కుమార్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు

కొత్త నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ స్వీకరించినపుడు మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతుందనే వాదనలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ద్వారా సైబర్ నేరగాళ్లు పంపించిన లింక్ ఓపెన్‌ చేసినప్పుడు, అప్లికేషన్ ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు, వాళ్లు చెప్పిన కోడ్‌కి డయల్‌ చేసినప్పుడు మాత్రమే ఫోన్లు హ్యాక్ అవుతాయని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details