తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja Seized: భారీగా గంజాయి రవాణా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్​ - మేడ్చల్ జిల్లా తాజా నేర వార్తలు

Ganja Seized: గంజాయి తరలింపులోనూ ఓ ముఠా చాకచక్యం ప్రదర్శించింది. అచ్చం పుష్ప సినిమా తరహాలో దాన్ని రవాణా చేస్తూ కటకటాలపాలయ్యారు. నిందితుల నుంచి 440 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

గంజాయి రవాణా
గంజాయి రవాణా

By

Published : Jul 6, 2022, 12:04 PM IST

Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మేడ్చల్ జిల్లా ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికాంత్ వెల్లడించారు.
ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన పెరపురెడ్డి అర్జున్‌(25), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన నేరళ్ల కిరణ్‌కుమార్‌(26), హైదరాబాద్‌ ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్‌ తహెర్‌(24)తో పాటు వీరేంద్రకుమార్‌, సందీప్‌, తేజ, ఫజల్‌ ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. ఏపీలోని అరకు నుంచి చేపలు రవాణా చేసే ప్లాస్టిక్‌ డబ్బాల్లో గంజాయి ప్యాకెట్లను నింపి డీసీఎంలో విశాఖపట్నంకు తెచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విశాఖపట్నంలో కొన్ని చేపల డబ్బాలను సైతం వాహనంలో ఎక్కించారని చెప్పారు.

విశాఖ నుంచి నేరుగా వరంగల్‌ వచ్చి అక్కడ చేపలు ఉన్న డబ్బాలను దించారన్నారు. అక్కడ నుంచి సోమవారం రాత్రి డీసీఎం ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌కు చేరుకొని.. ఇక్కడి నుంచి మహారాష్ట్రలోని సాంగ్లి, సోలాపూర్‌కు తరలించేందుకు కారులోకి గంజాయి ప్యాకెట్లను కారులో ఎక్కిస్తున్నారని చెప్పారు. పక్కా సమాచారంతో ఉప్పల్‌ ఆబ్కారీ పోలీసులు దాడి చేసి.. డబ్బాల్లో ఉన్న 440 కిలోల గంజాయి ప్యాకెట్లను, డీసీఎం వ్యాన్‌, కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.కోటికి పైగానే ఉంటుంది. ముఠాలో అర్జున్‌, కిరణ్‌కుమార్‌, తహెర్‌ మాత్రమే పట్టుబడ్డారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో కిరణ్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో గంజాయి రవాణా కేసు ఉంది. అందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవికాంత్‌ తెలియచేశారు.

ఇదీ చదవండి:బస్సును ఓవర్​టేక్ చేయబోయి ముగ్గురిని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి

పోలీసుల ప్లాన్​ సక్సెస్​.. కశ్మీర్​లో లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు

ABOUT THE AUTHOR

...view details