మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎక్సైజ్ ఆధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో చోటు చేసుకుంది.
అక్రమంగా మద్యం తరలింపు.. అదుపులో నిందితులు - Maharashtra Telangana border
కామారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు.
అక్రమంగా మద్యం తరలింపు.. అదుపులో నిందితులు
సలాబత్ పూర్ సరిహద్దు వద్ద ఎక్సైజ్ అధికారులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని దేగ్లూర్ పట్టణం నుంచి.. జిల్లాలోని పిట్లం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆటోలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా.. పట్టుకున్నామని ఆబ్కారీ ఎస్ఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని.. ఇద్దరు నిందితులతోపాటు.. 48 మద్యం సీసాలు, ఆటోను సీజ్ చేశారు.