Excise department official press meet in Rangareddy district: నకిలీ మద్యం కేసు విషయంలో దర్యాప్తు వేగంగా సాగుతోందని.. త్వరలోనే తప్పించుకు తిరుగుతున్న నలుగురిని కూడా అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రరావు తెలిపారు. నిందితులు ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని తెలిపారు. నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు దాదాపు కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని పట్టుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్‌రెడ్డి అలియాస్ శివారెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మెుత్తం 15 మందిలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ దాడుల సమయంలో మొత్తం మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రరావు తెలిపారు.