Babies Exchange in Government Hospital : మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. చెన్నూరుకు చెందిన ఓ గర్భిణీ ప్రసవం కొరకు ఆసుపత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆమెకు శస్త్రచికిత్స చేసింది. కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణీకి కాన్పు చేశారు.
ఇద్దరు మహిళల్లో ఒకరికి ఆడబిడ్డ, మరొకరికి మగబిడ్డ జన్మించారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట ఇద్దరు మహిళలకు చెందిన కుటుంబసభ్యులు ఎదురుచూస్తుండగా, ఆసుపత్రిలోని నర్సులు ఆడశిశువును ఇవ్వాల్సిన వారికి మగబిడ్డను అప్పగించారు. కాసేపట్లోనే తేరుకోని పొరపాటు జరిగిందని, ఆడశిశువును ఇవ్వాల్సిందిబోయి మగశిశువును ఇచ్చినట్లు నచ్చజెప్పేందుకు యత్నించారు. అప్పటికే శిశువుకు ప్రాథమిక చికిత్స చేయించుకుని రావటంతో గందరగోళం నెలకొంది.