తెలంగాణ

telangana

ETV Bharat / crime

అగ్ని ప్రమాదంలో మాజీ సర్పంచ్ ఇల్లు దగ్ధం - అగ్ని ప్రమాదంలో మాజీ సర్పంచి ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదం సంభవించి మాజీ సర్పంచ్ ఇల్లు కాలిపోయిన ఘటన జగిత్యాల జిల్లా చెప్యాల గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 15 లక్షల మేర ఆస్థి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

Ex-sarpanch burns house in fire
అగ్ని ప్రమాదంలో మాజీ సర్పంచి ఇల్లు దగ్ధం

By

Published : Apr 13, 2021, 3:23 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ బరిగె మల్లయ్య ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా.. వాహనం చేరుకునేలోపే అంతా జరిగిపోయిందని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల మేర ఆస్థినష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. మంటలు చెలరేగడానికి షార్ట్​సర్క్యూట్​ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజున ఈ ఆగ్ని ప్రమాదం జరగడం పట్ల బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details