ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చిన ప్రియుడు తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో హత్యచేసిన ఘటన మంగళవారం రాత్రి జీడిమెట్ల ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది.
Crime News: ప్రియురాలు సరదాగా రమ్మంటే.. హత్య చేసి వెళ్లాడు! - తెలంగాణ తాజా వార్తలు
తన మాజీ ప్రియుడిని సరదాగా కలిసేందుకు ఇంటికి రమ్మంది. ఆ వ్యక్తి 24 గంటల్లో ఆమె ముందు వాలిపోయాడు. ఇద్దరం కలిసుందామని ఆమెని కోరాడు. నిరాకరించింది. ఇంకేముంది చంపేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పూజ(21), రాజేశ్ వర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల వినాయక్‌నగర్‌లో అద్దెకుంటున్నారు. భర్త స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. మాజీ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూ.. సరదాగా ప్రియుడిని చూసేందుకు నగరానికి రావాల్సిందిగా కోరింది. 24 గంటల్లో ఓ స్నేహితుడిని వెంటబెట్టుకొని వచ్చి కలిశాడు. తన వెంట రావాలని ఇద్దరం కలిసుందామని కోరాడు. ఆమె నిరాకరించడంతో దిండుతో పూజను ఊపిరాడకుండా చేసి చంపేసి పరారయ్యాడు. హత్యపై భర్త రాజేశ్ వర్మ ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: