కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండా అటవీ ప్రాంతంలోని నీలగిరి చెట్ల వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు ఆరకపోవడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
కన్నాపూర్ తండాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన నీలగిరి వృక్షాలు - fire accident in kamareddy
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలోని నీలగిరి చెట్లకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి.. వారు వచ్చేలోగా మంటలార్పేందుకు ప్రయత్నించారు.
అగ్నిప్రమాదం, నీలగిరి చెట్లు దగ్ధం
సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు గంటల తరబడి శ్రమించారు. చెట్లు పూర్తిగా ఎండిపోయి ఉండటం వల్ల, పైగా వేసవి కాలం అవడం వల్ల మంటల్ని అదుపులోకి తీసుకురావడం కష్టమైంది.