తెలంగాణ

telangana

ETV Bharat / crime

మంథని కార్మికశాఖ అధికారిపై విచారణ ప్రారంభం

మంథని కార్మిక శాఖ అధికారిపై అభియోగాలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

enquiry on manthani labour officer
మంథని కార్మికశాఖ అధికారిపై విచారణ ప్రారంభం

By

Published : Mar 19, 2021, 7:01 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని కార్మిక శాఖ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని... కొందరు బాధితులు హైదరాబాద్​ కమిషనర్​కు, జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు తీసుకున్నారు. విచారణ నిమిత్తం అధికారులు వచ్చారని తెలుసుకున్న కార్మికులు పెద్ద ఎత్తున బాధితులు కార్మికశాఖ కార్యాలయం చేరుకుని గోడు వెల్లబోసుకున్నారు.

విచారిస్తున్న అధికారులు

సమస్యలు ఇవే..

మంథనిలోని కార్మికశాఖ కార్యాలయం అండర్​ గ్రౌండ్​లో ఉందని... దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని... వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది అవుతోందని... దీనిని మరో జాగాకు మార్చాలని కోరారు. కార్మిక శాఖ అధికారి హేమలత విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విధులకు సరిగా హాజరు కావట్లేదని బాధితులు తెలిపారు. కార్మికుల హక్కులు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ జిరాక్స్ యజమాని కనుసన్నుల్లోనే వ్యవహారాలు నడుస్తున్నాయని తెలిపారు. కార్మికులు ధైర్యం చేసి అడిగితే అధికారి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.

విచారిస్తున్న అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు దస్త్రాలు తనిఖీ చేసి... బాధితుల నుంచి వివరాలు సేకరించారు. జిరాక్స్ సెంటర్​కి వెళ్లి పూర్తి వివరాలు హైదరబాద్​ కమిషనర్​కు, కార్మికశాఖ మంత్రి నివేదిస్తామని వరంగల్​ లేబర్​ జోన్ జాయింట్ కమిషనర్​ సునీత వెల్లడించారు.

ఇదీ చూడండి:రక్షణ కల్పిస్తారు.. అవగాహన కోసం వీడియోలు రూపొందిస్తారు..

ABOUT THE AUTHOR

...view details