తెలంగాణ

telangana

ETV Bharat / crime

Jr. Artist suicide case : జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్.. అసలేం జరిగింది? కిరణ్ ఎక్కడ? - junior artists Anuradha suicide

జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ(Jr. Artist suicide case) మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె ప్రియుడు కిరణ్​ కోసం గాలిస్తున్నారు. దాదాపు ఆరేళ్లు కిరణ్​తో అనురాధ(Jr. Artist suicide case) ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్​పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

జూనియర్ ఆర్టిస్ట్ ప్రియుడి కోసం పోలీసుల గాలింపు
జూనియర్ ఆర్టిస్ట్ ప్రియుడి కోసం పోలీసుల గాలింపు

By

Published : Oct 1, 2021, 12:43 PM IST

జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్(Jr. Artist suicide case) అనే యువకుడిపై కేసు నమోదు చేసుకున్నారు. కిరణ్​పై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

అనురాధ.. కిరణ్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు తెలియకుండా వేరే యువతి(Jr. Artist suicide case) తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడని.. తనను మోసం చేశాడనే కోపంతో కిరణ్​తో ఆమె గొడవపడినట్లు పోలీసులు చెప్పారు. అయినా అతడు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే అనురాధ- కిరణ్​లు గత మూడు నెలలుగా ఫిలింనగర్​లోని త్రానిజైల్​సింగ్​ నగర్​లో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె బలవన్మరణానికి పాల్పడిన సమయంలో కిరణ్ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.​

అసలేం జరిగిందంటే..

కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(Jr. Artist suicide case) (22) మూడు నెలలుగా కిరణ్‌ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు.

బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ(Jr. Artist suicide case) మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details