చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రుల ఆశలు.. ఆశయాలను తుంచివేస్తూ తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. ఏపీ చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతిపురం మండలం రాళ్లబూదుగురు గ్రామానికి చెందిన కిరణ్ కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
'నాలా ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు' - ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య న్యూస్
క్రికెట్ బెట్టింగ్ మరో యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్‌కు బానిసై... నష్టాలను చవిచూసిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి 'నాలా ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు' అని సామాజిక మాధ్యమాల్లో సందేశమిచ్చి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఏపీ చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది.

'నాలా ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు'
క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన కిరణ్... నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పులో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 'నాలా ఎవరూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు' అని సామాజిక మాధ్యమాల్లో సందేశమిచ్చి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చదవండి:'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'