రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై బైకును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో విజ్ఞాన్ కళాశాలలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అనంతరం రోడ్డు పక్కనున్న ఆలయ ప్రహరీని ఢీకొట్టి లారీ నిలిచిపోయింది. మృతుడు సిరిసిల్లలోని ప్రగతి నగర్‌కు చెందిన ప్రణయ్ గౌడ్‌గా గుర్తించారు. ప్రణయ్ విజ్ఞాన్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Road accident: అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి - telangana varthalu

అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
16:20 December 11
అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
లారీ రూపంలో వచ్చిన మృత్యువు ప్రణయ్ ప్రాణాలను బలితీసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
missing boys found alive : అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే?
Last Updated : Dec 11, 2021, 5:20 PM IST