తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja Seized: ఒడిశా టూ ఔరంగాబాద్.. ​ భారీస్థాయిలో గంజాయి సీజ్..

Ganja Seized: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీస్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కార్లలో తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 320 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

50 lakh worth of cannabis
భారీస్థాయిలో గంజాయి సీజ్

By

Published : Apr 16, 2022, 4:34 PM IST

Ganja Seized: రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా భారీస్థాయిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో తరలిస్తున్న 320 కేజీల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్ శాఖ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒడిశా టూ మహారాష్ట్ర:ఒడిశా నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్​కు గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి 9 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ తరలించిట్లు ఎన్​ఫోర్స్​మెంట్ అధికారి తిరుపతి తెలిపారు. వారిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details