తెలంగాణ

telangana

ETV Bharat / crime

ED Raids in Hyderabad : హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు - Enforcement directorate raids on jewelry shop

హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు

By

Published : Oct 7, 2021, 10:31 AM IST

Updated : Oct 7, 2021, 11:34 PM IST

10:29 October 07

Ed Raids in Hyderabad : హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్​లోని శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు

 మనీలాండరింగ్​కు పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీకృష్ణ జ్యువెల్లరీ దుకాణాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాక ఈడీ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్​లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్​లోని ప్రధాన కార్యాలయం శ్రీకృష్ణా హౌస్​తో పాటు అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 2019లో బంగారు ఎగుమతుల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని డీఆర్ఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగానే నిన్న ఈడీ సోదాలు నిర్వహించింది. 

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని శ్రీకృష్ణ జువెల్లరీస్​కి చెందిన సెజ్ యూనిట్​లో నింబంధనలు అతిక్రమించి బంగారాన్ని ఎగుమతికి బదులు స్థానిక షాపులకు విక్రయించారని... మొత్తం 330 కోట్ల విలువ చేసే 1100 కేజీల బంగారాన్ని దారి మళ్లించారని.. 2019 మేలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంస్థ ఎండీ ప్రదీప్ కుమార్​తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్​కు పాల్పడ్డారని ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ రోజు ఉదయం ఆరు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఏకకాలంలో నగరంలోని అన్ని దుకాణాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెట్లను ఈడీ అధికారుల స్వాధీనం చేసుకున్నారు.  సిబ్బందిని విచారిస్తున్నారు. మనీలాండరింగ్​కు పాల్పడ్డారని తేలితే వారిపై కేసు నమోదు చేసి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా ఈడీ కొంతమందిని విచారించే అవకాశముంది. 

Last Updated : Oct 7, 2021, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details